జీవితంలో విజయం సాధించాలనుకుంటున్నారా ... ???


జీవితంలో విజయం సాధించాలనుకుంటున్నారా ... ???




జీవితంలో విజయం సాధించాలని ఎవరికుండదు చెప్పండి. ప్రతిఒక్కరూ గొప్పగానే జీవించాలనుకుంటారు కానీ గొప్పవాళ్ళు కావటానికి అవసరమయిన పనులు మాత్రం చెయ్యరు. కేవలం ఊహాల్లో గొప్పవాళ్ళు కావాలని విహరిస్తుంటారు.   ముందుగా మనం తెలుసుకోవాల్సింది  జీవితంలో విజయం సాధించిన వాళ్ళందరూ ఒక్కరోజులోనో, లేక అదృష్టం వల్లనో ఆ స్థాయి కి చేరుకోలేదు. ఆ స్థాయి కి చేరుకోవటానికి వాళ్ళు ఎంచుకున్న రంగంలో కష్టపడి ఎదిగినవారే. ధీరూ భాయ్ అంబానీ ఆ రోజుల్లో కేవలం 500 రూపాయలతో ముంబై కి వచ్చాడు  తను చనిపోయేనాటికి తన ఆస్తి 75,000 కోట్లు.  సచిన్ టెండూల్కర్ ఎక్కువ సమయం నెట్ ప్రాక్టీస్ లోనే గడిపేది. ఇలా ఆ స్థాయి కి ఎదిగిన వాళ్ళందరూ కష్టపడ్డవారే.  దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది వాళ్లకి సాధ్యం అయినది మనకు ఎందుకు అసాధ్యం అవుతుంది ... ?? 


విజేతలకుండే లక్షణాలు తెలుసుకుందాం...  

1. అభిరుచి:-   మనం ఏ పని అయితే చేద్దామనుకుంటున్నామో ఏ రంగంలో విజయం సాధించాలనుకుంటున్నామో  దాని మీద అభిరుచి కలిగి ఉండాలి.  మానసా, వాచా & కర్మణా దాని మీదే ధ్యాసని  కేంద్రీకృతం  చేయాలి.అప్పుడే  ఆ పనిని  మనం ఇష్టంగా చేయగలం.  ఒకవేళ మధ్యలో అవాంతరాలు   వచ్చినా  నిరుత్సాహ పడకుండా మన లక్ష్యాన్ని చేరుకోగలం. 


2. ఆత్మ విశ్వాసం:-  మన మీద మనకి ఆమితమైన విశ్వాసం కలిగి ఉండాలి. మనలో చాలా మందికి తమ  మీద కంటే పక్కవాళ్ళ మీదే ఎక్కువ నమ్మకం ఉంటుంది. పక్కవాళ్ళ మీద నమ్మకం ఉండటం మంచిదే కానీ మనమీద మనకు కూడా నమ్మకం ఉండాలి. ఆత్మ విశ్వాసం పెంపొందించుకోవడం కోసం ఎక్కువగా మోటివేషనల్, ఇన్స్పిరేషనల్ స్టోరీస్ లేదా వీడియోస్ చూస్తూఉండాలి. ఇంకా spiritual బుక్స్ చదవటం, exercise , మెడిటేషన్ లాంటివి చేస్తుంటే తప్పకుండా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.  


3. దృఢ నిశ్చయం:-     మనం ఒకటి సాధించాలనుకున్నామంటే తప్పకుండా అది జరిగితీరాల్సిందే. లక్ష్యాన్ని చేరుకునేంత వరకూ విశ్రమించకూడదు. దృఢ సంకల్పాన్ని కలిగి ఉండాలి. సంకల్పం గట్టిగా ఉంటె ఏదైనా సంభవమే అంటారు. 


4. సహనం:-   మనం ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని దానిని సాధించే క్రమం సులువుగా ఉంటుందనుకోలేం. కొన్ని కొన్ని ఇబ్బందులు, అవాంతరాలు ఏర్పడవచ్చు. మనం వాటికీ పరిష్కారాన్ని వెతుక్కుని తిరిగి ప్రయత్నాన్ని  కొనసాగించాలి. ఇలా చెయ్యాలంటే సహనం తప్పకుండ ఉండితీరాల్సిందే.         

 ఉదాహరణకి : మనం ఒక విత్తనాన్ని నాటిన వెంటనే ఎదిగి ఫలాలు ఇవ్వదు కదా ..!! అది ఎదిగే క్రమంలో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ఆ తరువాత మనం ఆ ఫలాలను అనుభవించే తీరుతాం. అలాగే మనం కొంచెం సహనాన్ని అలవర్చుకుంటే మన లక్ష్యాన్ని చేరుకొని జీవితాన్ని తృప్తిగా జీవిస్తాం. 

                      

Comments